BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »
www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

Thursday, July 9, 2009

పాలతో… ప్యాక్‌!
చర్మం పాలమెరుపు సంతరించుకోవాలంటే పాలను మించిన సౌందర్యసాధనం లేదంటున్నారు నిపుణులు. చర్మంపై పేరుకుపోయిన మలినాలను తొలగించి మెరుపునిచ్చే క్లెన్సర్‌గా పాలు బాగా పనిచేస్తుంది. అందుకే పాలతో వేసుకునే కొన్ని ఫేస్‌ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

* పచ్చిపాలలో దూది ముంచి ముఖమంతా అద్దాలి. అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ముఖం నున్నగా కాంతులీనుతుంది.
* నిద్రించేముందు అరకప్పు పచ్చిపాలకు టీస్పూన్‌ ఉప్పు కలిపి ముఖమంతా పట్టించి మరుసటి రోజు గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖచర్మం పైనున్న మృతకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతమవుతుంది.
* నానబెట్టిన రెండు బాదంపప్పులను మెత్తగా నూరి, పాలతో కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. చామనఛాయగా ఉండేవారికి ఇది అద్భుత ఫలితాన్నిస్తుంది.
* రాత్రంతా పాలలో నానబెట్టిన పెసరపప్పును మరుసటిరోజు మెత్తగా రుబ్బుకుని చిటికెడు పసుపు, టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం కలిపి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. దీంతో ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
* అరకప్పు పాలకు చెంచా చందనం పొడి, అరచెంచా పసుపు కలిపి ప్యాక్‌ వేసుకుంటే ముఖం ముత్యంలా మెరిసిపోతుంది.
* పొడిబారి ఇబ్బందిపెడుతున్న చర్మానికి ఈ ప్యాక్‌ చక్కని మందు. పాలమీగడలో రెండుచుక్కల బాదం నూనె, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ప్యాక్‌ను అరగంటాగి కడిగేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది.

* నిత్యం గ్లాసు పాలు తాగడం వల్ల శిరోజాలు, గోళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖం కూడా కాంతిని సంతరించుకుంటుంది

0 comments: